ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కరోనా పంజా.. 24 గంటల్లో ఏకంగా..

ABN , First Publish Date - 2020-07-08T19:23:07+05:30 IST

కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో మంగళవారం 193పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డిలో అత్యధికంగా 100 కేసులు నమోదు కాగా మేడ్చల్‌ జిల్లాలో 89,వికారాబాద్‌లో

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కరోనా పంజా.. 24 గంటల్లో ఏకంగా..

24 గంటలు.. 203 కరోనా కేసులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కరోనా పంజా

అత్యధికంగా రంగారెడ్డిలో 100, మేడ్చల్‌లో 89 

వికారాబాద్‌జిల్లాలో14, ఒకరు మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో మంగళవారం 193పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డిలో అత్యధికంగా 100 కేసులు నమోదు కాగా మేడ్చల్‌ జిల్లాలో 89,వికారాబాద్‌లో 14కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 4444కు చేరుకున్నాయి.


జీహెచ్‌ఎంసీలో 54 కేసులు నమోదు.. 

రంగారెడ్డిజిల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 కేసులు నమోద య్యా యి. ఇందులో కందుకూరు డివిజన్‌ సరూర్‌న గర్‌లో 17, శేరిలిం గంపల్లిలో 18, మైలార్‌దేవ్‌పల్లిలో 16, ఇబ్రహీంపట్నం డివిజన్‌ పరిధిలోని అబ్ధుల్లాపూర్‌మెట్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. 


నాన్‌జీహెచ్‌ఎంసీలో 46 కేసులు నమోదు

రంగారెడ్డిజిల్లా నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో 46కేసులు నమోద య్యాయి. ఇందులో కందుకూరు డివిజన్‌ పరిధిలోని బాలాపూర్‌లో 8, రాజేంద్రగనర్‌డివిజన్‌పరిధిలోని నర్కొడలో 4, నార్సింగిలో15, చేవెళ్లడివిజన్‌ పరిధిలోనిషాబాద్‌లో 4, ఆలూరులో 8, శంకర్‌పల్లిలో 2, మొయునాబాద్‌లో 5 నమోదయ్యాయి. 


మారేపల్లిలో కరోనా పాజిటివ్‌

మారేపల్లి గ్రామంలో ఓ రాజకీయ నాయకుడికి కరో నా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆయన  హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. 


పరిగిలో మరో మహిళకు..

పరిగిపట్టణం సాయిరాంనగర్‌కాలనీకి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె చేవెళ్ల మండలం ఆలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తుంది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చినందని వైద్యాఽధికారులు ధృవీకరించారు. 


అల్లాపూర్‌లో మరో వ్యక్తికి...

బషీరాబాద్‌ మండలంలోని అల్లాపూర్‌ గ్రామంలో ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల జ్వరంతోబాధపడుతున్న యువకుడిని హైదరాబాద్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షలు చేసి కరోనా సోకినట్లు బషీరాబాద్‌ వైద్యులు, పోలీసులకు సమాచారం అందించారు. కాగా యాలాల మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధికి కరోనా సోకినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై అధికారులు, వైద్యులను వివరణ కోరగా తమ వద్ద పూర్తిసమాచారం లేదని పేర్కొన్నారు. 


మల్కాపూర్‌లో...

మల్కా పూర్‌లో ఓవ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతనికి జ్వరం, దగ్గు తగ్గకపోవడంతో ఈనెల 3వ తేదీన నగరంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేయగా పాటిజివ్‌ వచ్చిందని అధికారులు నిర్ధారిం చారు. వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.   కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్‌ సూచించినట్లు ఏఎన్‌ఎం రాధ తెలిపారు.


శంషాబాద్‌లో నాలుగు..

శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. రాళ్ల గూడలో ఒకటి, హుడాకాలనీలో3  కరోనా కేసులు నమోదయ్యాయి. శంషాబాద్‌ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 59 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


మోమిన్‌పేట మండలంలో  ఏడు కేసులు

మోమిన్‌పేట్‌ మండలంలో 7  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మోమిన్‌పేటలో మూడు, దుర్గంచెరువులో మూడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కోలుకుందలో ఒక కేసు నమోదైంది. జిల్లాలో తొలిసారిగా వైద్యశాఖ సిబ్బందికి కరోనా వచ్చింది. మండలంలో పనిచేస్తున్న ఓ ఏఎన్‌ఎంకు కరోనా సంక్రమించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-07-08T19:23:07+05:30 IST