కరోనా ఎఫెక్ట్.. భారత విద్యార్థులకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2021-07-17T01:29:59+05:30 IST

కరోనా వైరస్ విజృంభణ విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే వారికి నిరాశ కలిగిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో అమెరికా యూనివర్సీల్లో కొత్తగా అడ్మిషన్ పొం

కరోనా ఎఫెక్ట్.. భారత విద్యార్థులకు తప్పని తిప్పలు

వాషింగ్టన్: కరోనా వైరస్ విజృంభణ విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే వారికి నిరాశ కలిగిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో అమెరికా యూనివర్సీల్లో కొత్తగా అడ్మిషన్ పొందిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు వీసా జారీ ఆలస్యం.. మరోవైపు విమాన సర్వీసుల కొరతతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో విధిలేక విద్యార్థులు చార్టెడ్ ఫ్లైట్‌లను ఆశ్రయిస్తున్నారు. 


అమెరికాలో ఉన్నత విద్య కోసం ఏటా లక్షల మంది విదేశీ విద్యార్థులు వెళ్తూ ఉంటారు. వీరిలో చైనా, భారత్‌కు చెందిన వారే అత్యధికంగా ఉంటారు. కాగా.. ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సీటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. దీంతో భారత విద్యార్థులు వీసా కోసం దరకాస్తు చేసుకుంటున్నారు. అయితే వీసా జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం భారత విద్యార్థులు ఎదురుచూడాల్సి వస్తోంది. 



ఇదిలా ఉంటే.. కరోనా ఉధృతి నేపథ్యంలో అమెరికా-భారతల మధ్య విమాన సర్వీసులు చాలా వరకు తగ్గాయి. దీనికి తోడు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. గతంతో పోల్చితే సుమారు 5రెట్లు విమాన ఛార్జీలు పెరిగినట్టు విద్యార్థులు చెబుతున్నారు. వీటిని సైతం భరిస్తున్నప్పటికీ సరిగ్గా ప్రయాణ సమయానికి విమాన సర్వీసులు రద్దవుతన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో భారత విద్యార్థులు చార్టెడ్ విమానాలవైపు మొగ్గు చూపుతున్నారు. 


Updated Date - 2021-07-17T01:29:59+05:30 IST