139 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-08T05:25:53+05:30 IST

139 మందికి కరోనా

139 మందికి కరోనా

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శుక్రవారం 12 కేంద్రాల్లో 422మందికి యాంటిజెన్‌ టెస్టులు చేయగా 139మందికి పాజిటివ్‌  తేలింది. ఇబ్రహీంపట్నం16, హయత్‌నగర్‌ 34, అబ్దుల్లాపూర్‌మెట్‌ 8, యాచారం 22, మంచాల 9 ఆరుట్ల 6, దండుమైలారం 8, ఎలిమినేడు 13, మాడ్గుల 11, ఇర్విన్‌ 9, రాగన్నగూడ 2, తట్టిఅన్నారంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.ఙ


  • ఆమనగల్లులో 22 మందికి కరోనా పాజిటివ్‌


ఆమనగలు: ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రిలో 44 మందికి పరీక్షలు నిర్వహించగా 22మందికి పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ జయశ్రీ, ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి తెలిపారు. అలాగే ఆమనగల్లు ఆస్పత్రిలో వివిధ గ్రామాలకు చెందిన 47 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు వారు పేర్కొన్నారు.


  • శంషాబాద్‌లో 33 కరోనా పాజిటివ్‌ కేసులు


శంషాబాద్‌: శంషాబాద్‌లోని కరోనా పరీక్షా కేంద్రంలో 75మందకి పరీక్షలు నిర్వహించగా 33 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారికి మందులు అందజేశామని డాక్టర్‌ నజ్మాబాను తెలిపారు. 


  • శంషాబాద్‌ మండలంలో 13 మందికి కరోనా 


శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ మండల పరిధిలోని 58మందికి కరో నా టెస్టులు నిర్వహించగా 13మందికి పాజిటివ్‌ వచ్చిందని, వారందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేశామని వైద్యులు దివ్య, రమ్య తెలిపారు.


  • కందుకూరులో 23 కరోనా కేసులు


కందుకూరు: కందుకూరు ఆరోగ్య కేంద్రంలో 41మందికి కరోనా పరీక్ష లు నిర్వహించగా 23మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కరోనా కట్టడికి సహకరించాలని డాక్టర్‌ రాధిక తెలిపారు.


  • చేవెళ్ల డివిజన్‌లో 48మందికి పాజిటివ్‌


చేవెళ్ల: చేవెళ్ల డివిజన్‌లో 175 మందికి పరీక్షలు చేయగా 48మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. చేవెళ్లలో 50మందికి పరీక్షలు చేయగా 10మందికి పాజిటివ్‌ వచ్చింది. షాబాద్‌ మండలంలో 17, శంకర్‌పల్లిలో 18, మొయినాబాద్‌ మండలంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. వారందరికీ మెడికల్‌ కిట్లు అందజేశామన్నారు.


  • తలకొండపల్లిలో 17మందికి కరోనా 


తలకొండపల్లి: తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని 40 మందికి పరీక్షలు నిర్వహించగా 17మందికి కరోనా వచ్చినట్లు వైద్యులు అజీమ్‌ తెలిపారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.


  • యాచారంలో 22మందికి కరోనా పాజిటివ్‌


యాచారం: పీహెచ్‌సీలో 40మందికి  యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 22మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. గున్గల్‌లో ఆరుగురు, చింతపట్లలో  ఐదుగురు, యాచారంలో నల్గురు,  కొత్తపల్లిలో  ఇద్దరు, కుర్మిద్ద, అయ్యవారిగూడ, నల్లవెల్లి, నజ్దిక్‌సింగారం, మంతన్‌గౌరెల్లి గ్రామాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు నందవనపర్తిలో ఇద్దరు, నజ్దిక్‌సింగారంలో ఇద్దరు. కుర్మిద్దలో ఒక్కరు, నానక్‌నగర్‌లో ఒక్కరు కరోనాతో మృతిచెందారు.


  • మాడ్గుల మండలంలో 11కరోనా పాజిటివ్‌ కేసులు


మాడ్గుల: మాడ్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35మందికి కరోనా పరీక్షలు చేయగా 11మందికి పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్‌ లలిత తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు.

Updated Date - 2021-05-08T05:25:53+05:30 IST