తహసీల్దార్‌కు కరోనా.. వైసీపీ ఎమ్మెల్యేతో పలుమార్లు సమావేశం
ABN , First Publish Date - 2020-04-14T18:56:15+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 17.
ఉద్యోగులు, రాజకీయ నేతల్లో కలవరం..
కాగా.. తాజాగా అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఓ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఉద్యోగులు, రాజకీయ నేతల్లో కలవరం మొదలైంది. ఈ తహసీల్దార్ మడకశిర ఎమ్మెల్యేతో పలుసార్లు సమావేశమయ్యారు. ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల సమక్షంలో క్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఇంతవరకూ స్పందించలేదు.
జిల్లాల వారిగా కేసుల లెక్కలివీ...