ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కరోనా సాకు : సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్

ABN , First Publish Date - 2021-01-20T18:04:25+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కరోనా సాకు చూపి ఎన్నికలను వాయిదా వేయాలని సీఎం జగన్ చూస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి

ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కరోనా సాకు :  సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్

గుంటూరు : స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే కరోనా సాకు చూపి ఎన్నికలను వాయిదా వేయాలని సీఎం జగన్ చూస్తున్నారని   సీపీఐ జిల్లా కార్యదర్శి అజయ్ ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల  ఇళ్ళ స్థలాలు పంపిణీ  చేసినప్పుడు ఏర్పాటు చేసిన సభలలో హాజరైన ప్రజలకు కరోనా వస్తుందని గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. సీఎం బహిరంగ సభలలో పాల్గొనే జనానికి రాని కరోనా  స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనే వారికి ఎలా వస్తుందో జగన్, అధికారులు  సమాధానం చెప్పాలని ఆయన  కోరారు. సీఎం సభలకు ఆర్టీసీ బస్సులలో జనాన్ని తరలించినపుడు వారికి కరోనా వస్తుందనే సోయి అధికారులకు రాలేదా అని ఆయన విమర్శించారు. 


కేవలం స్థానిక సంస్థల ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే వారు హైకోర్టుకు వెళ్లి ఎన్నికల వాయిదా కోసం కరోనాను సాకుగా చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటినా సీఎం జగన్, అధికారులు తమ తప్పు తెలుసుకుని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-20T18:04:25+05:30 IST