Abn logo
Aug 31 2021 @ 15:55PM

శ్రీకాకుళంలో కరోనా కలకలం

శ్రీకాకుళం: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మంగళవారం ఆమదాలవలస లక్ష్మీనగర్ మున్సిపల్ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టించింది. లక్ష్మీనగర్ స్కూల్లో జనరల్‌ కరోనా టెస్టులు చేయగా ఒక ఉపాద్యాయుడికి, నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నలుగురు విద్యార్థులకు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా బారినపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు హోం హైసోలేషన్‌కు పంపించారు. మిగతా విద్యార్థులకు   వైద్యా అధికారులు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటునప్పటికి పాఠశాలల్లో  క్రమంగా కేసులు పెరుగుతుండంతో ఉపాధ్యాయులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల్లో కేసులు పెరుగుతుండడంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడానికి జంకుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...