ఇంటి ముందే కుప్పకూలిన కరోనా అనుమానితుడు..

ABN , First Publish Date - 2020-04-07T18:54:03+05:30 IST

నెల్లూరు: ఓ కరోనా అనుమానితుడు ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా చేర్చుకోకపోవడంతో చివరకు తన ఇంటి ముందే కుప్పకూలిన ఘటన నెల్లూరులో కలకలం రేపింది.

ఇంటి ముందే కుప్పకూలిన కరోనా అనుమానితుడు..

నెల్లూరు: ఓ కరోనా అనుమానితుడు ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా చేర్చుకోకపోవడంతో చివరకు తన ఇంటి ముందే కుప్పకూలిన ఘటన నెల్లూరులో కలకలం రేపింది. స్థానిక ఉమ్మారెడ్డిగుంటలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా అతడిని చేర్చుకునేందుకు నిరాకరించారు. చివరకు హెల్ప్‌‌లైన్ నెంబర్లకు కాల్‌ చేసినా స్పందన కరువైంది. చివరకు ఆ వ్యక్తి తన ఇంటి ముందే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు ఆసుపత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఓ వైసీపీ నేత సిఫార్సుతో అంబులెన్స్ రావడం గమనార్హం.

Updated Date - 2020-04-07T18:54:03+05:30 IST