ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు మంత్రి ఈటల ఆదేశం

ABN , First Publish Date - 2020-08-02T03:05:23+05:30 IST

ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు మంత్రి ఈటల ఆదేశం

ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణకు మంత్రి ఈటల ఆదేశం

హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులు, వివిధ పత్రికల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ధరలు నిర్ణయించినప్పటికీ మందుల పేరుతో, పీపీఈ కిట్ల పేరుతో, ఐసీయూ చార్జీలు, వైద్య సిబ్బందికి అధిక జీతాల పేరుతో అడ్డగోలుగా ప్రజలపై భారం మోపడం తగదని మంత్రి అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. వైద్యం అందించాల్సిన బాధ్యత మర్చిపోయి ప్రైవేట్ ఆస్పత్రులు లాభాల కోసం మానవతా దృక్పథం లేకుండా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాపార కోణంలో ఆలోచించకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమ వంతు బాధ్యత పోషించాలని ఈటల కోరారు. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకోవడం తగదని అన్నారు. సాధారణ పరిస్థితి కంటే పది రేట్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-08-02T03:05:23+05:30 IST