ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం...

ABN , First Publish Date - 2020-04-04T11:47:22+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది....

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం...

ఏప్రిల్ 30వరకు దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిచెందుతుండటంతో విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్ 30వతేదీ వరకు ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపరాదని నిర్ణయించింది. దేశంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14వతేదీతో ముగియనున్నా ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30వతేదీ వరకు విమాన సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించడం సంచలనం రేపింది.


కాగా ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ విమానయాన సంస్థలు మాత్రం తమ దేశీయ విమాన సర్వీసులను ఏప్రిల్ 15 నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ల బుకింగ్ ను ప్రారంభించాయి. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం మే 1వతేదీ నుంచి నడపాలని ఇతర విమాన యాన సంస్థలు యోచిస్తున్నాయి. విస్తారా ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ చేస్తోంది. ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమాన సర్వీసులు, మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థల అధికార ప్రతినిధులు ప్రకటించారు. ఎయిర్ ఏసియా విమాన యాన సంస్థ మాత్రం దేశీయ విమాన సర్వీసులు నడపడంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Updated Date - 2020-04-04T11:47:22+05:30 IST