‘కరోనా కట్టడికి పరిశుభ్రతే మందు’

ABN , First Publish Date - 2020-04-10T00:31:36+05:30 IST

‘‘కరోనా కట్టడికి పరిశుభ్రతే మందు. తినే వస్తువుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టే ముందు తినుబండారాల కవర్‌ను కూడా శుభ్రంగా చేయాలి’’ అని నిపుణులు చెబుతున్నారు.

‘కరోనా కట్టడికి పరిశుభ్రతే మందు’

హైదరాబాద్: ‘‘కరోనా కట్టడికి పరిశుభ్రతే మందు. తినే వస్తువుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టే ముందు తినుబండారాల కవర్‌ను కూడా శుభ్రంగా చేయాలి’’ అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కరోనా కట్టడికి పలు సూచనలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు బయటి నుంచి రాగానే కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా చేతులను  శానిటైజర్‌తో కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత కూడా వేపాకు, పసుపు, నిమ్మకాయతో కలిసిన నీటితో మరొకసారి చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-10T00:31:36+05:30 IST