అనంతపురం: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న అంగన్‌వాడి కార్యకర్త శకుంతల అస్వస్థతకు గురైంది. అనంతపురంలోని రాణీనగర్‌కు చెందిన శకుంతల శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంది. శకుంతల ఆరోగ్యంపై వైద్యాధికారులను ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డులో శకుంతలకు చికిత్సను అందిస్తున్నారు.