కరోనా రోగం.. బతుకంతా ఆగం..

ABN , First Publish Date - 2021-05-07T06:44:34+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా సంక్షోభం వేళ ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. కరోనా రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వందల రూపాయల మందులు ఇచ్చి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. అంత చెల్లించినా రోగి బతుకుతాడన్న నమ్మకం లేదు. బతికితే తమ ఆస్పత్రి గొప్పగా చెప్పుకుంటున్నాయి. చనిపోతే రోగి ఖర్మకు వదిలేస్తున్నాయి. రోగి చనిపోయినా అడిగినంత ఫీజు చెల్లించకపోతే వదిలిపెట్టడం లేదు. డబ్బు చెల్లిస్తేనే మృతదేహాన్ని తీసుకుపోనిస్తున్నాయి.

కరోనా రోగం.. బతుకంతా ఆగం..

పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు

చికిత్స ఫీజుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు

కానరాని చార్జీల పట్టికలు.. అమలు కాని ప్యాకేజీలు..

ప్రైవేటు ఆస్పత్రులతో వైద్యాధికారుల కుమ్మక్కు

యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ

ఆర్థికంగా చితికి పోతున్న కరోనా బాధితులు


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కరోనా సంక్షోభం వేళ ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. కరోనా రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వందల రూపాయల మందులు ఇచ్చి ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. అంత చెల్లించినా రోగి బతుకుతాడన్న నమ్మకం లేదు. బతికితే తమ ఆస్పత్రి గొప్పగా చెప్పుకుంటున్నాయి. చనిపోతే రోగి ఖర్మకు వదిలేస్తున్నాయి. రోగి చనిపోయినా అడిగినంత ఫీజు చెల్లించకపోతే వదిలిపెట్టడం లేదు. డబ్బు చెల్లిస్తేనే మృతదేహాన్ని తీసుకుపోనిస్తున్నాయి. 


హన్మకొండ (ఆంధ్రజ్యోతి), హన్మకొండ అర్బన్‌, మే 6: ప్రైవేటు ఆ స్పత్రుల్లో కొవిడ్‌ రోగుల అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకొని రూ. ల క్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చేర్చుకోవడానికి అడ్వా న్సుగా రూ.లక్ష కట్టించుకుంటున్నారు. ప్రతీ రోజు రూ.15,000 చొప్పున అడ్వాన్సుడు ఎక్స్‌పెండిచర్‌ కింద తీసుకుంటున్నారు. ఇవికాకుండా ఆక్సీజన్‌ పెడితే రూ.20వేలు, మందుల పేరుతో రూ.35వేలు, పరీక్షల పేరుతో రూ.50వేలు పిండుకుంటున్నారు. వెంటిలేటర్‌ కోసం రూ.70 వేలు  వసూలు చేస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ అయిదు రోజుల పాటు ఇవ్వడానికి ప్యాకేజీ పేరుతో రూ. లక్షా 50వేలు వసూలు చేస్తున్నారు.


ఉత్తర్వులు బేఖాతరు

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ప్యాకేజీ ధరలు నిర్ణయించి వాటి అమలుకు ప్రభుత్వం గత సంవత్సరం కరోనా మొదటి వేవ్‌ ఉధృతంగా ఉన్న తరుణంలో ఏప్రిల్‌ నెలలోనే ఉత్తర్వులు జారీ చేసింది. అధిక ఫీజులకు కళ్లెం వేసేందుకు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. బాధితులు కోలుకున్నాక డిశ్చార్జి చేసే సమయంలో పూర్తి వివరాలతో బిల్లులు ఇవ్వాలని అందులో పేర్కొన్నది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు ఆస్పత్రులు పెద్దగా పట్టించుకోవట్లేదు.


ధరల పట్టికలేవి ?

మెజారిటీ ఆస్పత్రులు సర్కారు నిర్ణ యించిన ధరలకు కరోనా చికిత్స చేయట్లే దు. ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. అలాగే ప్రైవేటు ఆస్పత్రు ల్లో కరోనా రోగులకు కేటాయించిన పడకలు, అందులో ఖాళీల వివరా లతో బోర్డులు ఏర్పాటు చేయాలన్న సూచనలను  బేఖాతరు చేస్తు న్నాయి ఆస్పత్రుల తీరుపై, భారీగా బిల్లులు వేస్తుండడంపై పెద్ద ఎత్తు న ఫిర్యాదు రావడంతో ఒకటీ రెండు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీనితో ప్రైవేటు ఆస్పత్రులు రూటు మార్చి ఆస్పత్రి ముద్రిత బిల్లులు కాకుండా చెల్లకాగితంపై రాసి నగదు రూపంలో వసూలు చేస్తున్నాయి. ఇలా చేస్తే ప్రైవేటు ఆస్పత్రుల్లో సగం పడకల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకుంటూ తమ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు రకరకాల దొంగదారులను అనుసరిస్తున్నాయి. కరోనా రోగులకు చేసే చికిత్స ధరల పట్టికను ప్రతీ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం చార్డుల రూపంలో బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించింది. కేవలం ట్రీట్‌మెంట్‌ ధరలనే కాదు.. పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను కూడా అందులో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ప్రైవేటు ఆస్పత్రులు బేఖాతరు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొవిడ్‌ చికిత్స చేస్తున్న ఈ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ బోర్డులు కనిపించడం లేదు. వివిధ రకరాల సాధారణ జబ్బులకు వైద్యం అందించేందుకు తీసుకునే ఫీజులను కూడా ప్రదర్శించడం లేదు.


ఇష్టారాజ్యంగా..

ప్రభుత్వ నిర్దేశించిన ధరలు కాకుండా తమ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కరోనా చికిత్సకు ప్రభుత్వం ప్యాకేజీలను నిర్ణయించింది. ఈ ప్యాకేజీ కిందే చికిత్స చేసి నిర్దేశిత ఫీజులనే వసూలు చేయాలి. ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను  స్పష్టంగా వివరించింది. ప్యాకేజీ కింద రోజువారీగా రొటీన్‌ వార్డు, ఐసోలేషన్‌కు రూ. 4వేలు, ఐసీయూ (వెంటిలేటర్‌ లేకుండా) ఐసోలేషన్‌ రూ. 7500, ఐసీయూ (వెంటిలేటర్‌ సహా) ఐసోలేషన్‌ రూ.9వేలుగా నిర్ణయించింది. ప్రభుత్వ నిర్దేశించిన ప్యాకేజీలన్నిట్లో రోగికి సీబీసీ, యూరిన్‌ రోటీన్‌, హెచ్‌ఐవీ స్పాట్‌, యాంటీ హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌, సీరం క్రియాటినైన్‌, యూఎస్‌జీ, 2 డీ ఎకో, డ్రగ్స్‌, ఎక్స్‌రే, ఈసీజీ,, కన్సల్టేషన్స్‌, బెడ్‌ చార్జీలు, భోజనంతో పాటు ప్రాసీజర్స్‌ (రెలేస్ట్యూట్‌ ఇన్సర్షన్‌, యూరినరీ ట్రాక్‌ క్యాథరైజేషన్‌) సేవలు అందుతాయి. 

ప్యాకేజీలో లభించని సేవల్లో ఇంటర్వేన్షల్‌ ప్రొసీజర్‌స్‌ (సెంట్రల్‌ లైన్‌ ఇన్సర్షన్‌, కీమోపోర్టు ఇన్సర్షన్‌, బ్రాంకోస్కోపిక్‌ ప్రొసీజర్‌, బైయా ప్సీస్‌, యాసిటిక్‌, ఫ్లైరల్‌ టాప్పింగ్‌) వీటికి రూ. 2019 డిసెంబర్‌ 31 నాటి ర్యాక్‌ రేట్ల ఆధారంగా చార్జీలు వసూలు చేయాలి. కొవిడ్‌-19 పరీ క్షలను ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే చేయాలి. హైఎండ్‌ డ్రగ్స్‌ (ఇమ్యునోగ్లోబిన్‌, మెరోపెనమ్‌, పేరంటల్‌ న్యూట్రిషన్‌, టోసిల్‌ జంబ్‌ వంటి వాటికి ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలి. కానీ ఏ ప్రైవే టు ఆస్పత్రి ప్యాకేజీలను అమలు చేయడం లేదు. అవి ఉన్నాయన్న విషయాన్ని కూడా చెప్పడం లేదు. ఒక్కో పరీక్షకు ఇంత అని ఇష్టమొ చ్చిన రేట్లను నిర్ణయించి రోగులకు అర్ధం కానీ, అంతుచిక్కని రీతిలో బి ల్లులను తయారు చేసి వారిపై రుద్దుతున్నాయి. రోగులు, వారి బంధు వులకు సేవల వివరాలను వెల్లడించాలని ఉన్నా పట్టించుకోవడం లేదు. పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేనివాళ్ళు, అతితక్కువ లక్షణా లున్న వాళ్ళను ఆస్పత్రుల్లో చేర్చుకోవద్దు. వారిని ఐసోలేషన్‌కు పరిమి తం చేసి చికిత్స అందించాలి. లక్షణాలు లేకున్నా రోగి భయాన్ని, అను మానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు ఆస్పత్రిలో చేర్చుకుంటున్నాయి. ఏ చికిత్స అందించకుండానే వేలల్లో బిల్లులు వేస్తున్నాయి.


బెడ్లు.. రోగులు..

కరోనా చికిత్సకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 96 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిల్లో 1894 పడకలు ఉన్నాయి. ఒక్క వరంగల్‌ నగరంలోనే 186 ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి లభించగా,  వీటిలో 150 ఆస్పత్రులు లాగిన్‌ అయ్యాయి. 42 ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందుతోంది. వీటిల్లో 1600 పడకలు ఉండగా, ప్రస్తుతం 1011 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 275మంది రోగులు అత్యవసర చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో రెండు ఆస్పత్రుల్లో 40 పడకలు ఉన్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాలలో ఒక ఆస్పత్రులో 20 పడకలు, భూపాలపల్లి జిల్లాలో 5 ఆస్పత్రుల్లో 200 పడకలు, జనగామ జిల్లాలో 2 ప్రైవేటు ఆస్పత్రుల్లో 34 పడకలు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుమారు 200 మంది రోగులు  ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 



Updated Date - 2021-05-07T06:44:34+05:30 IST