Abn logo
Apr 22 2021 @ 19:04PM

వారికో న్యాయం... వీరికో న్యాయమా?: రామకృష్ణ

అమరావతి: ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. ఏపీలో రోజుకు 10 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. సీబీఎస్‌ఈ పరీక్షలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసమే ఏపీలో పరీక్షల నిర్వహణ అని చెప్పటం దుర్మార్గమన్నారు. మంత్రుల పిల్లలు పరీక్షలు రాస్తున్నారా?, తమ పిల్లలకు ఒక న్యాయం, మిగతా విద్యార్థులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement
Advertisement