Advertisement
Advertisement
Abn logo
Advertisement

మేం ప్రేమించుకుంటున్నాం...Cricketer కేఎల్ రాహుల్, అతియాశెట్టి జంట అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియాశెట్టిలు తాము ప్రేమించుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. క్రికెటర్ కేఎల్ రాహుల్, సినీనటి అతియా శెట్టి జంట ఎట్టకేలకు అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్ లో అధికారికంగా కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు.ప్రముఖనటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియాశెట్టి పుట్టినరోజున రాహుల్ వారి సంబంధాన్ని ధ్రువీకరిస్తూ ప్రేమించుకున్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.రాహుల్ తన లేడీ లవ్‌కి హృదయం ఎమోజీతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు, ఈ సంవత్సరం జులైలో రాహుల్, అతియా శెట్టిల కామన్ ఫ్రెండ్ సోనాలి ఫాబియానీతో ఉన్న వేర్వేరు చిత్రాలను ఇన్‌స్టాగ్రాం లో వరుసగా పోస్ట్ చేశారు. ఈ జంట రహస్యంగా ఇంగ్లాండులో హాలిడేని ఆస్వాదించారు. అతియా ఇటీవల తన ఇన్‌స్టాగ్రాం లో కేఎల్ రాహుల్‌తో బ్రాండ్ ఫోటో షూట్ చిత్రాన్ని పంచుకుంది.2019లో ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వ్యాపించాయి.కెఎల్ రాహుల్ పూర్తి పేరు కన్నూర్ లోకేశ్ రాహుల్.ఈయన కర్ణాటకలోని మంగళూరుకు చెందినవారు. 

29 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఐపీఎల్ 2020లో కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్‌గా కనిపించారు.అతియాశెట్టి 2015లో సూరజ్ పంచోలీ సరసన ‘హీరో’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె తర్వాత ‘ముబారకన్’ నటించింది. చివరిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన మోతీచూర్ చక్నాచూర్‌లో కనిపించింది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement