గేల్‌కు కోపమొచ్చింది

ABN , First Publish Date - 2020-10-20T09:09:22+05:30 IST

ముంబైపై సులభంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లడం తనకు కోపం, భాధ ..

గేల్‌కు కోపమొచ్చింది

దుబాయ్‌: ముంబైపై సులభంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు తీసుకెళ్లడం తనకు కోపం, భాధ కలిగించాయని పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ చెప్పాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు టై కావడంతో.. సూపర్‌ ఓవర్‌ ఆడారు.


అందులోనూ స్కోరు సమమవడంతో మరో సూపర్‌ ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. 12 పరుగుల ఛేదనలో గేల్‌ సిక్స్‌తో మ్యాచ్‌ను పంజాబ్‌వైపు మొగ్గేలా చేశాడు. మయాంక్‌ రెండు ఫోర్లతో గెలిపించాడు. ‘సూపర్‌ ఓవర్‌ ఆడేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆందోళనా లేదు. కానీ, సులువుగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఇలా జరగడంపై కొంత కోపం, బాధ కలిగింది. కానీ, క్రికెట్‌లో ఇవన్నీ భాగమే’ అని మ్యాచ్‌ అనంతరం షోలో అగర్వాల్‌, షమితో గేల్‌ అన్నాడు. మొదటి సూపర్‌ ఓవర్‌లో షమి అద్భుతంగా బౌలింగ్‌ చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడాడని గేల్‌ ప్రశంసించాడు.

Updated Date - 2020-10-20T09:09:22+05:30 IST