రైతు రోదనకు స్పందించిన వ్యాపారవేత్త

ABN , First Publish Date - 2020-10-25T07:37:22+05:30 IST

రైతు రోదనను పత్రికల్లో చూసి ఓ వ్యాపారవేత్త స్పందించారు. రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

రైతు రోదనకు స్పందించిన వ్యాపారవేత్త

పంట నష్టపరిహారంగా రూ. 2 లక్షలు అందజేత


ఎల్కతుర్తి, అక్టోబరు 24: రైతు రోదనను పత్రికల్లో చూసి ఓ వ్యాపారవేత్త స్పందించారు. రూ.2లక్షలు ఆర్థిక సహాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన సింగనబోయిన ఐలయ్య సాగు చేసిన ఆరెకరాల వరి పంట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగింది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 20వ తేదీన గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించడానికి వచ్చారు.


ఆయన ఎదుట బాధిత రైతు ఐలయ్య బోరున విలపిస్తూ తన గోడు విన్నవించాడు. ఈ విషయం పత్రికల్లో రావడంతో చలించిన సిద్ధిపేటకు చెందిన యువ వ్యాపారవేత్త గంధగోని చక్రాధర్‌ స్పందించారు. శనివారం సూరారం గ్రామానికి వచ్చి బాధితుడి అకౌంట్‌లో రూ.2 లక్షలు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక రైతు కుటుంబాన్ని ఆదుకున్నానన్న తృప్తి తనకు కలిగిందన్నారు. అలాగే క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఆయన వెంట డిగ్నిటీ డ్రైవ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ రేనీగ్రేస్‌, బిడియల్‌ విన్నర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు అరికపూడి రఘ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-25T07:37:22+05:30 IST