రైతుల కోసం ‘క్రాప్‌ దర్పణ్‌’!

ABN , First Publish Date - 2021-01-24T08:51:49+05:30 IST

విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతుకు సహకరించే ఓ యాప్‌ను ఐఐఐటీహెచ్‌ రూపొందించింది. ‘క్రాప్‌ దర్పణ్‌’ అనే ఈ వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ యాప్‌ను ఇండో జపాన్‌ జాయింట్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ

రైతుల కోసం ‘క్రాప్‌ దర్పణ్‌’!

విత్తు నుంచి విక్రయం వరకు అండగా నిలవనున్న యాప్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతుకు సహకరించే ఓ యాప్‌ను ఐఐఐటీహెచ్‌ రూపొందించింది. ‘క్రాప్‌ దర్పణ్‌’ అనే ఈ వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ యాప్‌ను ఇండో జపాన్‌ జాయింట్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ ప్రాజెక్టులో భాగంగా ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు ఏ పంటలు ఎప్పుడు వేయాలి, చీడ, పోషకాల లోపాలను ఎదుర్కొనే విధానం నుంచి పండిన పంట విక్రయం వరకు అన్ని విషయాల్లోనూ ఈ యాప్‌.. ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా రైతులకు భూసార లోపం, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ తెగుళ్లు, వాటికి వినియోగించాల్సిన ఎరువులు, క్రిమిసంహారాల గురించిన సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.  

Updated Date - 2021-01-24T08:51:49+05:30 IST