నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2021-09-17T05:39:55+05:30 IST

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రేస్‌ దాడి ఆ పార్టీ నైజాన్ని తెలియజేసిందని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, జూపల్లి రమేష్‌, కోటగిరి సీతారామస్వామి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, నారాయణపురం సొసైటీ అధ్యక్షుడు నిర్మల పుల్లారావు, మందపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నేతలు

అశ్వారావుపేట, సెప్టెంబరు 16: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రేస్‌ దాడి ఆ పార్టీ నైజాన్ని తెలియజేసిందని  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, జూపల్లి రమేష్‌, కోటగిరి సీతారామస్వామి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, నారాయణపురం సొసైటీ అధ్యక్షుడు నిర్మల పుల్లారావు, మందపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం పట్టణంలో కాంగ్రెస్‌ నాయకుల దాడిని ఖండిస్తూ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీఐ ఉపేందరరావును కలిసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కొత్తమామిళ్ళవారిగూడెంలో గ్రామశాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, సర్పంచ్‌ సూర్యచంద్రరరావు, యుగంధర్‌, సత్యనారాయణ, శ్రీనివాసరావు గిరిజన ఎమ్మెల్యేపై అసభ్యపదజాలంను ఉపయోగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి శ్రీనివాసరావు, సంపూర్ణ, పణీంద్ర, నాని, కలపాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

దమ్మపేట, సెప్టెంబరు 16: అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, జారే ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. దమ్మపేటలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యాకర్తలు దాడి చేయటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. సమావేశంలో జడ్పీటీసి పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్‌, కొయ్యల అచ్యుతరావు, సొసైటీ చైర్మన్‌ రావు జోగేశ్వరరావు, దారా మల్లికార్జునరావు, ఆత్మాకమిటీ చైర్మన్‌ కేవీ సత్యనారాయణ, రావు గంగాధరరావు, దొడ్డా రమేష్‌, యార్లగడ్డ బాబు, ఎర్రా వసంతరావు, కాసాని నాగప్రసాద్‌, మడకం రాజేష్‌, వల్లభనేని అజయ్‌కుమార్‌, బొల్లికొండ ప్రభాకర్‌, పానుగంటి చిట్టిబాబు, పోతినేని శ్రీరామ వెంకట్రావు పాల్గొన్నారు.

దమ్మపేట, సెప్టెంబర్‌ 16 : అశ్వారావుపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడిచేసివారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంక్షేమపరిషత్‌ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్‌ దొర గురువారం ప్రకటనలో డిమాండు చేశారు. ప్రభుత్వ కార్యాలయం పై దాడి చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల పై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో పెనుబల్లి ప్రసాద్‌, కుంజా చినబాబు, వెంకన్నబాబు తదితరులున్నారు.


Updated Date - 2021-09-17T05:39:55+05:30 IST