సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు: జయేష్ రంజన్

ABN , First Publish Date - 2021-07-17T23:54:21+05:30 IST

రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.

సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు: జయేష్ రంజన్

హైదరాబాద్: రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ పాలసీ వలన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియాతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా డిజిటల్ తెలంగాణ ప్రారంభించిందని చెప్పారు. కోవిడ్ వలన ఆన్‌లైన్‌లోనే చదువులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేస్తున్నామని, డిజిటల్ పే మెంట్స్ కూడా చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, డిజిటల్ ప్లాట్ ఫారంను ఆసరాగా చేసుకుని అనేక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకూ కూడా డిజిటల్ సేవలను తీసుకెళ్లాలని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు  ఆన్‌లైన్‌ క్లాసులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

Updated Date - 2021-07-17T23:54:21+05:30 IST