డీమాట్ ఖాతాలు పెరిగాయి : సెబీ

ABN , First Publish Date - 2021-09-17T00:00:13+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 8.5 రెట్ల డీమాట్‌ ఖాతాలు పెరిగాయని సెబీ ప్రకటించింది. సీఐఐ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఈ ప్రకటన చేశారు.

డీమాట్ ఖాతాలు పెరిగాయి : సెబీ

ముంబై : ఈ ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 8.5 రెట్ల డీమాట్‌ ఖాతాలు పెరిగాయని సెబీ ప్రకటించింది. సీఐఐ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతుండటంతో ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌ భారీగా పెరిగిందని చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే కాసుల వర్షం కురుస్తుందని కొత్త ఇన్వెస్టర్లు భావిస్తున్నారని, మార్కెట్‌పై సరైన నిర్దేశనం లేనిపక్షంలో నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


ఏడాదిన్నర క్రితం భారీగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు, ప్రస్తుతం పుంజుకున్నాయని అజయ్‌ త్యాగీ చెప్పారు. ఈ ఘనత ఇన్వెస్టర్లు, కార్పొరేట్లకు దక్కుతుందని పేర్కొన్నారు. గతేడాది మార్చి తర్వాత ప్రస్తుతం మార్కెట్లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయని, ఈ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి గాడిన నేపధ్యంలో  ఇండియన్‌ మార్కెట్స్‌ మంచి ఫలితాలను అందిస్తున్నాయన్నారు. మార్కెట్‌పై అవగాహన లేకుండా ప్రస్తుతం ఎంతో మంది పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారని, అందువల్ల నిపుణుల సలహాలు తీసుకుని తమ తప్పులను సరిచేసుకోవాలని అజయ్‌ త్యాగీ సూచించారు. 

Updated Date - 2021-09-17T00:00:13+05:30 IST