పాస్టర్‌ ఇంటిపై కానిస్టేబుల్‌ వీరంగం

ABN , First Publish Date - 2021-04-22T05:35:18+05:30 IST

పాస్టర్‌ ఇంటిపై కానిస్టేబుల్‌ వీరంగం

పాస్టర్‌ ఇంటిపై కానిస్టేబుల్‌ వీరంగం

కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు

పరారీలో కానిస్టేబుల్‌ పాపయ్య 

వరంగల్‌ అర్బన్‌ క్రైం, ఏప్రిల్‌ 21: సుబేదారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ పాస్టర్‌ ఇంటిపై కానిస్టేబుల్‌ దాడి చేశాడు. తమ భూమిలోకి వచ్చి తమకే ఎదురు మాట్లాడుతారా.. అంటూ పాస్టర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడికి ప్రయత్నించి, దుర్భాషలాడి బెదింపులకు పాల్పడ్డాడు. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ రెవెన్యూకాలనీలో సిలివేరు విజయరాజు అనే పాస్టర్‌ కుటుంబ సభ్యులతో సొంత ఇంటిని నిర్మించుకుని  నివసిస్తున్నాడు. రెండు రోజులు కిందట తన సొంత ఇంటి పక్కనే మరుగుదొడ్డిని నిర్మించుకునేందుకు పనులు ప్రారంభించాడు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ ఏఆర్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ పాపయ్య ఇల్లు ఆ పక్కనే ఉంది. పాస్టర్‌ నిర్మించుకుంటున్న పనుల వద్దకు కానిస్టేబుల్‌ పాపయ్య వెళ్లి తన స్థలంలోకి వచ్చి కట్టడాలు జరుపుతున్నారని, కట్టడాలు ఆపకుంటే అందరిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా కట్టిన గోడను కూల్చివేసి సిమెంట్‌ ఇటుకలను పెద్దపెద్ద బండరాళ్లతో పగులగొట్టాడు. విజయరాజుతో పాటు అతడి కుటుంబ సభ్యులపై  దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే వారు 100 డయల్‌కు ఫోన్‌ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సద్దుమనిగేలా చేశారు. పాస్టర్‌ కుటుంబంపై వీరంగం సృష్టించిన కానిస్టేబుల్‌ పాపయ్యపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పాపయ్య కోసం పోలీసులు గాలిస్తున్నట్టు వెల్లడించారు. 

Updated Date - 2021-04-22T05:35:18+05:30 IST