పెరగనున్న నిత్యావసర ధరలు..!

ABN , First Publish Date - 2021-01-11T20:55:08+05:30 IST

నిత్యావసర ధరలు త్వరలో పెరగనున్నట్లు వ్యాపారవర్గాల నుంచి వినవస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు ఇదే చెబుతున్నాయి. అంటే వినియోగదారులు తమ రోజువారీ ఉత్పత్తుల కోసం త్వరలో ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితులు రావచ్చని వినవస్తోంది.

పెరగనున్న నిత్యావసర ధరలు..!

హైదరాబాద్ : నిత్యావసర ధరలు త్వరలో పెరగనున్నట్లు వ్యాపారవర్గాల నుంచి వినవస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) కంపెనీలు ఇదే చెబుతున్నాయి. అంటే వినియోగదారులు తమ రోజువారీ ఉత్పత్తుల కోసం త్వరలో ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితులు రావచ్చని వినవస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... ఎఫ్ఎంసీజీ కంపెనీలు కీలకమైన ముడి పదార్థాల ఇన్‌పుట్‌పై ద్రవ్యోల్భణ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో కంపెనీలు ఉత్పత్తుల ధరలు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 


కాగా... మెరికో, ఇతర కొన్ని ఎఫ్ఎంసీజీ సంస్థలు ఇప్పటికే ధరల పెంపు దిశగా వెళ్లగా, ఇప్పుడు డాబుర్, పార్లె, పతంజలి వంటి కంపెనీలు ఆ దిశగా యోచిస్తున్నాయి. కొబ్బరి నూనె, పామాయిల్ వంటి ముడి పదార్థాల ఇన్‌పుట్ ధరల పెరుగుదలను వినియోగదారుల నుండి వసూలు చేసేందుు ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. అయితే కంపెనీలు ఎక్కువ కాలం వేచి చూసే అవకాశం లేదని, మరింత కాలం వేచి చూసినపక్షంలో వారి స్థూల మార్జిన్‌లపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో... త్వరలోనే ధరలు పెరగవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2021-01-11T20:55:08+05:30 IST