Advertisement
Advertisement
Abn logo
Advertisement

దాల్‌ పరోటా

కావలసినవి: గోధుమపిండి - అరకేజీ, సెనగపప్పు - ఒక కప్పు, కారం - అర టీస్పూన్‌, పసుపు - చిటికెడు, మామిడికాయ పొడి - అర టీస్పూన్‌, గరం మసాల - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, 


తయారీ: గోధుమపిండిలో నీళ్లుపోసి మెత్తటి మిశ్రమంలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సెనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకుని, తరువాత మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. పప్పు చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో పసుపు, కారం, మామిడికాయ పొడి, గరంమసాల, జీలకర్రపొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకొంటే స్టఫ్‌ రెడీ. గోధుమపిండిని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి. మధ్యలో దాల్‌ స్టఫ్‌ పెట్టి అన్ని వైపుల నుంచి దగ్గరకు మూయాలి. ఇప్పుడు నెమ్మదిగా చపాతీ కర్రతో మళ్లీ వెడల్పుగా చేసుకోవాలి. పెనంపై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


డ్రై ఫ్రూట్‌ పనీర్‌ పరోటాపచ్చి బొప్పాయి రొట్టెసజ్జ రొట్టెపుదీనా పరోటాకీటో రోటీఉలవల పరోటాహైదరాబాదీ బిదారీ పరాటాపాలకొల్లు దిబ్బరొట్టిఉల్లితో జొన్నరొట్టె (వీడియో) మేథీ పరోటా
Advertisement