Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి నుంచే ‘దళితబంధు’ ప్రారంభించాలి: బండి సంజయ్‌

కరీంనగర్‌: సీఎం కేసీఆర్‌ గురువారం నుంచే హుజూరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని బీజేపీ నేత బండి సంజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఉప ఎన్నికలో వ్యవహరించిన తీరుపై దుమ్మెత్తిపోశారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు టీఆర్‌ఎస్‌ పతనానికి నాంది అని హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ వాటిని కేంద్రంపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తోందని, వరిసాగుపై రాష్ట్ర రైంతాంగాన్ని అయోమయానికి గురి చేస్తోందని బండి సంజయ్‌ విమర్నించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement