తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు
ABN , First Publish Date - 2021-06-16T02:04:54+05:30 IST
తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలో జూన్ 21 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నారు. తెలంగాణలో జూలై 1 నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు.
మరో వారం రోజుల్లో ఇంటర్ ఫలితాలు ప్రకటిస్తామని ఇప్పటికే తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేసింది. అలాగే ఇంటర్మీడియేట్ కాలేజీల్లో తరగతుల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించింది. జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, జూలై 15 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామని కార్యదర్శి ఉమర్ జలీల్ పేర్కొన్నారు.