దూరం పెట్టిందనే కూతురి హత్య

ABN , First Publish Date - 2020-07-08T10:54:01+05:30 IST

అమానుషంగా ఐదేళ్ల చిన్నారి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఘట్‌కేసర్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం ..

దూరం పెట్టిందనే కూతురి హత్య

ఘట్‌కేసర్‌ రూరల్‌: అమానుషంగా ఐదేళ్ల చిన్నారి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఘట్‌కేసర్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. ఈనెల 2న మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ  ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌లో కలకలం రేపిన చిన్నారి ఆధ్య కేసు వివరాలను ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి  మంగళవారం విలేకరుల సమావేశంలో వివరించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన సూరనేని కల్యాన్‌రావు ఆత్మకూర్‌మండలంలో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తూ భార్య అనుషా, కూతురు ఆధ్య(5)తో కలిసి ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారిహోమ్స్‌లో  ఇంట్లో అద్దెకు ఉం టున్నారు. 2018లో ఎఎస్‌రావునగర్‌లోని అప్రోనిక్స్‌ ఆపిల్‌ మొబైల్‌ షోరూంకుఅనుషా వెళ్లినప్పుడు గుగ్గిళ్ల కరుణాకర్‌(27)తో పరిచ యం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారి తీసిం ది. ఈ క్రమంలో కరుణాకర్‌ తనస్నేహితులైన రాజశేఖర్‌ను అనూ షకు పరిచయం చేయించాడు. కొద్దిరోజుల నుంచి రాజశేఖర్‌తో అనూష సన్నిహితంగా ఉంటూ కరుణాకర్‌ను దూరం పెట్టింది.  దీంతో రాజశేఖర్‌ను ఎలాగైనా చంపాలని కరుణాకర్‌ అనుకు న్నాడు. ఈనెల 2న మధ్యాహ్నం రాజశేఖర్‌ అనూష ఇంటికి వచ్చాడు.


రాజశేఖర్‌ను తప్పించాలని అమె  ఇంటికి వచ్చిన కరుణాకర్‌ను చిల్డ్రన్‌ బెడ్‌రూంలో పెట్టి బయటనుంచి గడియ౅ పట్టింది. అప్పటికే ఆరూమ్‌లో ఆధ్య ఆడుకుంటుంది. గడియ తీయాలని లేదంటే ఆధ్యను చంపుతానని కరుణాకర్‌ బెదిరించినా గడియ తీయలేదు. బ్లేడ్‌తో ఆధ్య గొంతుకోసాడు.  తను గొంతు కోసుకున్నారు. ఈ క్రమంలో చిన్నారి గట్టిగా అరవడంతో అనుషా  గడియ తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆధ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుని వద్ద ఉన్న సర్జికల్‌ బ్లేడ్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనంచేసుకుని, అతన్ని చికిత్సనిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కోలుకున్న తర్వాత  మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-07-08T10:54:01+05:30 IST