ఆగని రుణ ఎగవేతలు

ABN , First Publish Date - 2021-11-26T09:16:50+05:30 IST

ప్రాజెక్టుల పేరుతో రుణాలు తీసుకోవడం. ఆ తర్వాత ఏదో ఒక పేరుతో టోపీ పెట్టడం అక్రమార్కులకు మామూలై పోయింది. చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నా కొంతమంది కేటుగాళ్లు.. అప్పులిచ్చిన బ్యాంకులకే టోపీ పెడుతూ మజా చేస్తున్నారు.

ఆగని రుణ ఎగవేతలు

  • జూన్‌ నాటికి రూ.6.85 లక్షల కోట్లు..
  • పీఎస్‌బీలపైనే 77.4% భారం


ముంబై : ప్రాజెక్టుల పేరుతో రుణాలు తీసుకోవడం. ఆ తర్వాత ఏదో ఒక పేరుతో టోపీ పెట్టడం అక్రమార్కులకు మామూలై పోయింది. చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నా కొంతమంది కేటుగాళ్లు.. అప్పులిచ్చిన బ్యాంకులకే టోపీ పెడుతూ మజా చేస్తున్నారు. ఇలాంటి ఉద్దేశపూర్వక ఎగవేతలతో బ్యాంకింగ్‌ రంగం కుంగిపోతోంది. దీంతో ఈ ఏడాది జూన్‌ నాటికి ఉద్దేశపూర్వక ఎగవేతల భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. 2019 డిసెంబరుతో పోలిస్తే ఇది రూ.63,000 కోట్లు ఎక్కువ. గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే మాత్రం రూ.75,000 కోట్ల భారం తగ్గింది. 


పీఎస్‌బీలపైనే భారం..

ఉద్దేశపూర్వక ఎగవేతల్లో ఎప్పటిలా ప్రభుత్వ రంగ  బ్యాంకుల (పీఎస్‌బీ)పైనే అధిక భారం పడుతోంది. ప్రాజెక్టుల మదింపు, రుణాల మంజూరు, రుణాల వినియోగంపై పర్యవేక్షణ వంటి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బడా బాబు లు, కేటుగాళ్లు పీఎ్‌సబీలకు టోపీ పెడుతూనే ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ నాటికి ఉన్న రూ.6.85 లక్షల కోట్ల ఉద్దేశపూర్వక ఎగవేతల్లో పీఎ్‌సబీల వాటా 77.4 శాతం. దీన్నిబట్టి అక్రమార్కులు.. పీఎ్‌సబీల సొమ్ముతో ఎలా మజా చేస్తున్నారో ఆలోచించుకోవచ్చు. 


కారణాలు ఇవే

రుణ వితరణను ఎంత పటిష్ఠం చేసినా బ్యాంకింగ్‌ రంగం ఇంకా కొన్ని లోపాలతో కునారిల్లుతోంది. అక్రమార్కులతో కొంతమంది బ్యాంకర్ల కుమ్ముక్కు, చట్టపరమైన లోపాలు అక్రమార్కులకు వరాలుగా మారుతున్నాయి. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి ఘరానా పెద్దలు ఈ లోపాలతోనే వేల కోట్ల బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టి విదేఽశాలకు చెక్కేశారు. 

Updated Date - 2021-11-26T09:16:50+05:30 IST