తగ్గిన విదేశీ మారక నిల్వలు

ABN , First Publish Date - 2021-04-03T06:17:01+05:30 IST

విదేశీ మారక నిల్వలు మార్చి 26వ తేదీతో ముగిసిన వారంలో 298.6 కోట్ల డాలర్ల మేరకు తగ్గి 57,928.5

తగ్గిన విదేశీ మారక నిల్వలు

ముంబై : విదేశీ మారక నిల్వలు మార్చి 26వ తేదీతో ముగిసిన వారంలో 298.6 కోట్ల డాలర్ల మేరకు తగ్గి 57,928.5 కోట్ల డాలర్లకు చేరాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు 322.6 కోట్ల డాలర్ల మేరకు తగ్గడం ఈ వారంలో నిల్వలు తగ్గడానికి కారణమైంది. ఇదే వారంలో బంగారం నిల్వలు 27.6 కోట్ల డాలర్ల మేరకు పెరిగి 3490.7 కోట్ల డాలర్లకు చేరాయి. కాగా ఈ ఏడాది జనవరి 29వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చారిత్రక గరిష్ఠ స్థాయి 59,018.5 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 


Updated Date - 2021-04-03T06:17:01+05:30 IST