మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్ స్కోర్ ఎంతంటే?

ABN , First Publish Date - 2020-02-21T21:00:28+05:30 IST

టీ20 మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా

మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్ స్కోర్ ఎంతంటే?

సిడ్నీ: టీ20 మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మందానా శుభారంభాన్ని ఇచ్చారు. నాలుగు ఓవర్లలోనే 40 పరుగులు చేశారు. అయితే జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద స్మృతి(10) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరింది. అయితే మరో రెండు పరుగులకు షఫాలీ వర్మ(29) కూడా అవుట్ అయ్యింది. పెర్రీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి సదర్ ల్యాండ్ చేతికి చిక్కింది. హర్మన్ ప్రీత్ కౌర్(2) స్వల్ప స్కోరుకే అవుటై నిరాశపర్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(49 నాటౌట్) నిలకడగా ఆడటంతో స్కోర్ బోర్డు 132కి చేరింది. ఆసీస్ బౌలర్లలో జోనాస్సెన్ రెండు వికెట్లు తీసుకోగా.. పెర్రీ, కిమ్మిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు.   

Updated Date - 2020-02-21T21:00:28+05:30 IST