ఫామ్‌లోకి కోహ్లీ..

ABN , First Publish Date - 2020-10-04T09:19:49+05:30 IST

విరాట్‌ కోహ్లీ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్‌) ఫామ్‌లోకి రావడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

ఫామ్‌లోకి కోహ్లీ..

 విరాట్‌, పడిక్కళ్‌ అర్ధ శతకాలు 

8 వికెట్లతో బెంగళూరు గెలుపు

చిత్తుగా ఓడిన రాజస్థాన్‌

విరాట్‌ కోహ్లీ (72 నాటౌట్‌)బంతులు: 53 ఫోర్లు: 7సిక్సర్లు: 2


అబుదాబి: విరాట్‌ కోహ్లీ (53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 నాటౌట్‌) ఫామ్‌లోకి రావడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. కోహ్లీతోపాటు దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 63) రాణించడంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. తొలుత రాజస్థాన్‌.. చాహల్‌  (3/24) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్‌ లోమ్రర్‌ (39 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 47) ఆకట్టుకొన్నాడు. ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 158/2 స్కోరు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా చాహల్‌ నిలిచాడు. 

ఛేదన ఏకపక్షంగా: ఓ మాదిరి లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ ఫించ్‌ (8)ను బెంగళూరు వేగంగా కోల్పోయింది. అయితే, ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌, కోహ్లీ పసలేని రాయల్స్‌ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కోవడంతో మ్యాచ్‌ ఏకపక్షమెంది. గోపాల్‌ వేసిన ఐదో ఓవర్‌లో  కోహ్లీ సీజన్‌లో తొలి బౌండ్రీ సాధించాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతున్న పడిక్కల్‌.. 12వ ఓవర్‌లో ఉనాద్కట్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో పరాగ్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఫోర్‌, సిక్స్‌తో గేర్‌ మార్చాడు. 15వ ఓవర్‌లో సింగిల్‌తో విరాట్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే, పడిక్కల్‌ను బౌల్డ్‌ చేసిన ఆర్చర్‌.. రెండో వికెట్‌కు 99 రన్స్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అప్పటికి బెంగళూరు విజయానికి 25 బంతుల్లో 31 రన్స్‌ కావాలి. ఈ తరుణంలో కోహీతో కలసిన డివిల్లీర్స్‌ (12 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

ఆదుకొన్న లోమ్రర్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ పవర్‌ప్లే కూడా ముగియకుండానే టాపార్డర్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, యువ ఆటగాడు మహి పాల్‌ లోమ్రర్‌ ఆదుకోవడంతో గౌరవప్రద స్కోరు చేయగలిగింది. ఓపెనర్‌ స్మిత్‌(5).. ఉదాన బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ బట్లర్‌ (22).. సైనీ బౌలింగ్‌లో పడిక్కల్‌ క్యాచ్‌ అందుకోవడంతో పెవిలియన్‌ చేరాడు. సంజూ శాంసన్‌(4)ను చాహల్‌ రిటర్న్‌క్యాచ్‌తో అవుట్‌ చేశా డు. 31/3తో ఇబ్బందుల్లో పడ్డ రాయల్స్‌ను ఊతప్ప (17), లోమ్రర్‌ ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఊతప్పను అవుట్‌ చేసిన చాహల్‌.. నాలుగో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. రియాన్‌ పరాగ్‌ (16), మహిపాల్‌ ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అయితే, పరాగ్‌ను ఉదాన క్యాచ్‌ అవుట్‌ చేశాడు. 17వ ఓవర్‌లో లోమ్రర్‌ను చాహల్‌ పెవిలియన్‌ చేర్చాడు. తెవాటియా (24 నాటౌట్‌), ఆర్చర్‌ (16 నాటౌట్‌) చివర్లో ధాటిగా ఆడడంతో జట్టు స్కోరు 150  దాటింది. 


స్కోరుబోర్డు

రాజస్థాన్‌: బట్లర్‌ (సి) పడిక్కల్‌ (బి) సైనీ 22, స్మిత్‌ (బి) ఉదాన 5, సంజూ శాంసన్‌ (సి అండ్‌ బి) చాహల్‌ 4, ఊతప్ప (సి) ఉదాన (బి) చాహల్‌ 17, మహిపాల్‌ లోమ్రర్‌ (సి) పడిక్కళ్‌ (బి) చాహల్‌ 47, రియాన్‌ పరాగ్‌ (సి) ఫించ్‌ (బి) ఉదాన 16, రాహుల్‌ తెవాటియా (నాటౌట్‌) 24, ఆర్చర్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు:3; మొత్తం: 20 ఓవర్లలో 154/6; వికెట్ల పతనం: 1-27, 2-31, 3-31, 4-70, 5-105, 6-114; బౌలింగ్‌: ఉదాన 4-0-41-2, సుందర్‌ 4-0-20-0, సైనీ 4-1-37-1, చాహల్‌ 4-0-24-3, జంపా 3-0-27-0, శివమ్‌ దూబె 1-0-4-0.

బెంగళూరు: దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (బి) ఆర్చర్‌ 63, ఫించ్‌ (ఎల్బీ) శ్రేయాస్‌ గోపాల్‌ 8, కోహ్లీ (నాటౌట్‌) 72, డివిల్లీర్స్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు:3; మొత్తం: 19.1 ఓవర్లలో 158/2; వికెట్ల పతనం: 1-25, 2-124; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-18-1, ఉనాద్కట్‌ 3-0-31-0, శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-27-1, టామ్‌ కర్రాన్‌ 3.1-0-40-0,  తెవాటియా 4-0-28-0, రియాన్‌ పరాగ్‌ 1-0-13-0. 

Updated Date - 2020-10-04T09:19:49+05:30 IST