Abn logo
Apr 10 2021 @ 23:49PM

ఢిల్లీ గ్రాండ్ విక్టరీ.. చెన్నై చిత్తు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో భాగంగా జరిగి రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. 189 పరుగల లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఛేదించి రికార్డు సృష్టించింది. ప్రధానంగా ఢిల్లీ ఓపెనర్లు పృధ్వీ షా(72), శిఖర్ ధవన్(85) విజృంభించి ఆడడంతో ఢిల్లీ జట్టు భారీ లక్ష్యన్ని సులభంగా ఛేదించింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. చెన్నైకు బ్యాటింగ్ అప్పగించింది. అయ్యర్ గైర్హాజరీలో తొలి సారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రిషబ్ పంత్  అద్భుతంగా రాణించాడు. కాగా.. చెన్నై జట్టు కేవలం 7 పరుగులకే 2 వికెట్లు కల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మోయీన్ అలీ(36), సురేశ్ రైనా(54) అర్థసెంచరీతో రాణించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వీరిద్దరూ అవుటైన తరువాత చెన్నై స్కోరు వేగం మళ్లీ మందగించింది. కానీ, చివర్లో శామ్ కర్రాన్(34) సిక్సులు, ఫోర్లతో ధాటిగా ఆడడంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ ఓక్స్, ఆవేశ్ ఖాన్‌లు చెరో రెండు వికెట్లు తీగా.. రవిచంద్రన్ అశ్విన్, టామ్ కర్రాన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం.. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు అదిరిపోయే ఓపెనింగ్ లభించింది. పృధ్వీ షా-శిఖర్ ధవన్ ధ్వయం అత్యధికంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో ఢిల్లీ విజయానికి అత్యంత చేరువైంది. 72 పరుగలు చేసిన తరువాత పృధ్వీ షా అవుటైనా.. అప్పటికే ఢిల్లీ విజయం దాదాపు ఖరారైపోయింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌(7), ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(14), షిమర్రన్ హెట్‌మెయిర్(0 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో కేవలం 18.4 ఓవర్లలోనే ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి సునాయాసంగా విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, డ్వేన్ బ్రావో 1 వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధవన్‌కు లభించింది. 

Advertisement
Advertisement
Advertisement