మూసివున్న గదిలో నాలుగు మృతదేహాలు... రాజధానిలో కలకలం!

ABN , First Publish Date - 2021-04-01T17:50:26+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో...

మూసివున్న గదిలో నాలుగు మృతదేహాలు... రాజధానిలో కలకలం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఇంటి యజమాని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఉదంతం రోహిణిలోని నాహర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక బస్సు డ్రైవర్ ముందుగా తన భార్య, పిల్లలను హత్య చేశాడు. తరువాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే తాగినమైకంలో ఆ డ్రైవర్ ఈ హత్యలకు పాల్పడివుండవచ్చని కూడా భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణి ప్రాంతానికి చెందిన డ్రైవర్ ధీరజ్(30) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-04-01T17:50:26+05:30 IST