సైనా అవుట్‌

ABN , First Publish Date - 2021-10-21T09:20:33+05:30 IST

డెన్మార్క్‌ ఓపెన్‌లో బుధవారం బరిలో దిగిన భారత షట్లర్లలో యువ కెరటం లక్ష్యసేన్‌ మినహా అంతా విఫలమయ్యారు. వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఆరంభ రౌండ్లోనే కంగుతింది. సింగిల్స్‌ తొలిరౌండ్లో సైనా 16-21, 14-21తో జపాన్‌ షట్లర్‌ అయా ఒహొరి చేతిలో

సైనా అవుట్‌

  • రెండోరౌండ్‌కు లక్ష్యసేన్‌


ఓడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌లో బుధవారం బరిలో దిగిన భారత షట్లర్లలో యువ కెరటం లక్ష్యసేన్‌ మినహా అంతా విఫలమయ్యారు. వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఆరంభ రౌండ్లోనే కంగుతింది. సింగిల్స్‌ తొలిరౌండ్లో సైనా 16-21, 14-21తో జపాన్‌ షట్లర్‌ అయా ఒహొరి చేతిలో ఓటమిపాలైంది. లక్ష్యసేన్‌ 21-9, 21-7తో సహచరుడు సౌరభ్‌కు షాకిచ్చి రెండోరౌండ్‌ చేరాడు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 18-21, 19-21తో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడగా, చో తిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో పోరులో 0-3తో వెనుకంజలో ఉన్న దశలో కశ్యప్‌ గాయంతో వెనుదిరిగాడు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని, మేఘన-పూర్వీశా, మిక్స్‌డ్‌లో సాత్విక్‌-అశ్విని జంటలు ప్రత్యర్థుల చేతిలో తొలిరౌండ్లోనే ఓడి నిష్క్రమించారు. 

Updated Date - 2021-10-21T09:20:33+05:30 IST