పిల్లల టీకాను అభివృద్ధి చేయండి

ABN , First Publish Date - 2021-07-31T09:18:28+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

పిల్లల టీకాను అభివృద్ధి చేయండి

శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి 

వెంకయ్యనాయుడు పిలుపు


మేడ్చల్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : కరోనా మహమ్మారి నుంచి పిల్లలను రక్షించుకునేందుకు ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కరోనా వైర్‌సను కట్టడి చేసే పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. శుక్రవారం  తెలంగాణలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలోని భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకా తయారీ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. బయోటెక్‌ రంగంలో శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలకు సంబంధించిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను తిలకించారు. బయోటెక్‌, ఫార్మా రంగాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉందని, ప్రత్యేకించి హైదరాబాద్‌ హబ్‌గా మారిందని ఉపరాష్ట్రపతి అన్నారు. చాలా తక్కువ సమయంలోనే కొవాగ్జిన్‌ను తయారు చేసి ఎంతోమంది ప్రాణాలను రక్షించారని భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలను ప్రశంసించారు. ఈ సదస్సు సందర్భంగా భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి శాలువా కప్పి సన్మానించారు. 

Updated Date - 2021-07-31T09:18:28+05:30 IST