Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని ఉమపై దాడి అమానుషం: అచ్చెన్నాయుడు

గుంటూరు: ఏపీ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడి అమానుషమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ గూండా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నానని అచ్చెన్నాయుడు అన్నారు. అక్రమంగా గ్రావెల్ తవ్వుకుని లక్షలాది రూపాయల ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ దాడికి ప్రేరేపించారని అచ్చెన్న మండిపడ్డారు. దాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సి వస్తుందని, దాడి జరుగుతున్నా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికే రక్షణ లేదంటే సామాన్యులు పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు రాకపోతే దేవినేని ఉమను హత్యచేసి ఉండేవాళ్లని, దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతలను 24 గంటల లోపల అరెస్ట్‌ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Advertisement
Advertisement