Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవాదాయ భూమిపై కొడాలి నాని కన్నేశాడు: దేవినేని ఉమ

అమరావతి: రూ.2లక్షల కోట్ల విలువైన హెరాయిన్ ఏపీ కేంద్రంగా చలామణీలోకి వస్తే ముఖ్యమంత్రి ఎందుకు నోరెత్తడు? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించరు. అమూల్ పాలకేంద్రాలపై సమీక్షలుచేయడం కాదు, డ్రగ్స్ దందా గుట్టుమట్లు, దానివెనకున్న సూత్రధారులెవరో ప్రజలకు  చెప్పాల్సిన నైతికత  జగన్‌రెడ్డిపై ఉందన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారంతోపాటు, దేవాదాయభూముల ఆక్రమణ వెనుక మంత్రుల ప్రమేయముందనే, ముఖ్యమంత్రి తన మంత్రులతో బూతులపంచాంగం మొదలెట్టించాడని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు సహా, పవన్ కల్యాణ్ లక్ష్యంగా అందుకే బూతుల పంచాంగం సాగుతున్నదన్నారు. 


మంత్రి కొడాలినాని రూ.250 కోట్ల విలువైన దేవాదాయ భూమిని కాజేయడానికి సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఆయనకు మేలుచేయడానికి కృష్ణాజిల్లాకు చెందిన ఉన్నతాధికారి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నాడన్నారు. నిషేధిత జాబితాలోఉన్నదేవాదాయ భూమిని, నానీపరం  చేయడానికి శ్రమిస్తున్న అధికారికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయంలోని వ్యక్తులుఎవరు? అని ఉమ ప్రశ్నించారు. దాతలిచ్చిన భూమిపై కన్నేసిన మంత్రినానీ, దేవాదాయమంత్రి వెల్లంపల్లి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ వ్యవహారంపై నోరుమెదపాలన్నారు. 


నీరు-చెట్టుపథకం కింద సాగు ఆయకట్టు కోసం, గత ప్రభుత్వంలో వివిధ రకాల పనులు చేసిన వారికి చెల్లించాల్సిన రూ.1277కోట్లను జగన్ ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. పనులు చేసినవారు కోర్టులను ఆశ్రయిస్తే, ఈప్రభుత్వం కోర్టుకు కూడా తప్పుడు సమాచారమిస్తోందన్నారు. గతప్రభుత్వంలో నీరు-చెట్టు పథకంలో భాగస్వాములైన వారందరితో టీడీపీ ఆధ్వర్యంలో వచ్చేనెల 4న సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. నీరు-చెట్టు కింద గతప్రభుత్వంలో పనులుచేసినవారికి జగన్ ప్రభుత్వం న్యాయంచేసేలా, టీడీపీ కార్యాచరణకు సిద్ధమవుతోందన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement