ఇటీవల మరణించిన సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ కవి దేవిప్రియ స్మృతిలో జనవరి 24 ఆదివారం ఉదయం 10 గంటలకు కవిసంధ్య ఆధ్వర్యంలో జూమ్ వేదికగా సంస్మరణ సభ జరుగుతుంది. ఈ సందర్భంగా దేవిప్రియపై ప్రత్యేకంగా వెలువరించిన కవిసంధ్య–28వ సంచిక ఆవిష్కరణ ఉంటుంది. ఈ సభలో కె. శివారెడ్డి, బి. నర్సింగరావు, కె. రామచంద్రమూర్తి, ఓల్గా, ఖాదర్ మోహియుద్దీన్, వాసిరెడ్డి నవీన్, శిఖామణి, సీతారాం, యాకూబ్, ప్రసాదమూర్తి, కుప్పిలి పద్మ, బండ్ల మాధవరావు, దాట్ల దేవదానంరాజు, డా. నీలిమ శ్రీనివాస్ తదితరులతో పాటు దేవిప్రియ కుటుంబసభ్యులు పాల్గొంటారు. జూమ్ మీటింగ్ ఐడి: 3206021069, పాస్‌వర్డ్: UCmNOG ద్వారా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు.
కవిసంధ్య, కవిత్వ పత్రిక, యానాం