నా హీరో ధోనీ

ABN , First Publish Date - 2021-05-18T05:49:53+05:30 IST

వెటరన్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తన హీరో అని హీరోయిన్‌ రష్మిక మంధాన తన మనసులోని మాట బయటపెట్టింది. ఇటీవ ల సోషల్‌ మీడియాలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులతో...

నా హీరో ధోనీ

బెంగళూరు: వెటరన్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తన హీరో అని  హీరోయిన్‌ రష్మిక మంధాన తన మనసులోని మాట బయటపెట్టింది. ఇటీవ ల సోషల్‌ మీడియాలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులతో  ముచ్చటిస్తూ రష్మిక ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్‌సీబీకి తాను వీరాభిమానినని చెప్పిన రష్మిక.. తన అభిమాన ఆటగా డు మాత్రం ఎంఎస్‌ ధోనీ అని పేర్కొంది. ‘ఽధోనీ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌, కెప్టెన్సీ అన్ని పాత్రల్లోనూ ప్రాణం పెట్టి ఆడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధోనీ మాస్టర్‌ క్లాస్‌ ప్లేయర్‌. అతడే నా హీరో’ అని ఈ కన్నడ ముద్దుగుమ్మ మహీపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. అయితే, ఆర్‌సీబీ వీరాభిమాని అంటూనే రష్మిక ధోనీని పొగడ్తలతో ముంచెత్తడం బెంగళూరు అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Updated Date - 2021-05-18T05:49:53+05:30 IST