కెరీర్‌ వాస్తవ చిత్రం చూపించాడు.. ధోనీ‌పై యువీ కామెంట్స్!

ABN , First Publish Date - 2020-08-04T04:40:50+05:30 IST

టీమిండియా మాజీ సారధి ధోనీ తన క్రికెట్ కెరీర్ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకునేలా చేశాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ వెల్లడించాడు.

కెరీర్‌ వాస్తవ చిత్రం చూపించాడు.. ధోనీ‌పై యువీ కామెంట్స్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి ధోనీ తన క్రికెట్ కెరీర్ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకునేలా చేశాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ వెల్లడించాడు. క్రికెట్‌లో పునరాగమనం చేసేవాడినే కానని, అయితే కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని యువీ చెప్పాడు. కోహ్లీ ప్రోత్సాహంతోనే పునరాగమనం చేశానని, అయితే సెలెక్టర్ల దృష్టిలో తానేంటో ధోనీనే చూపించాడని తెలియజేశాడు. ‘ధోనీ నాకు వాస్తవ చిత్రం చూపించాడు. 2019 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు నన్ను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని ధోనీనే నాకు తెలిసేలా చేశాడు’ అని యువీ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-04T04:40:50+05:30 IST