Abn logo
Dec 1 2020 @ 03:29AM

వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా పాండెమిక్‌

న్యూయార్క్‌, నవంబరు 30: పాండెమిక్‌ (మహమ్మారి) పదాన్ని తమ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2020’గా ప్రకటిస్తున్నట్లు డిక్షన రి.కామ్‌తో పాటు మెరియం-వెబ్‌స్టర్‌ వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది ‘పాండెమిక్‌’ పదాన్ని ప్రజలు అధికంగా వాడారు. మహమ్మారి అంటే ఏంటనే విషయాన్ని చిన్నారులకు తల్లిదండ్రులు వివరించారు. ఈ నేపథ్యంలోనే పాండెమిక్‌ పదాన్ని డిక్షన రి.కామ్‌, మెరియం-వెబ్‌స్టర్‌ ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటించాయి. 


Advertisement
Advertisement
Advertisement