కడపలో వైసీపీ వర్గీయుల మధ్య విబేధాలు

ABN , First Publish Date - 2020-05-27T21:27:48+05:30 IST

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.

కడపలో వైసీపీ వర్గీయుల మధ్య విబేధాలు

కడప: సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బి.కోడూరు మండలం, పాయలకుంట దగ్గర వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సచివాలయ భూమిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఎదుటే ఇరు వర్గాలు బాహ బాహీకి దిగాయి. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. 


అక్కడ మండల నాయకులు ఇద్దరి మధ్య వర్గ విబేధాలు తరచు వస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరుడు యోగానందరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామకృష్ణారెడ్డిల మధ్య చాలా కాలంగా వర్గ విబేధాలున్నాయి. బుధవారం సచివాలయ భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో యోగానందరెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరగడంతో రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-05-27T21:27:48+05:30 IST