‘ఫుడ్‌వేస్ట్‌’ ఇట్టే చెప్పేస్తుంది!

ABN , First Publish Date - 2020-02-22T06:19:51+05:30 IST

‘ఫుడ్‌ బిహేవియర్‌’ అనేది అందరికీ అవసరమే. పార్టీల్లో, ఫంక్షన్లలో ప్లేటు నిండా ఆహారాన్ని నింపుకుని, ఆ తర్వాత తినలేక డస్ట్‌బిన్‌లో పడేసేవారు చాలామంది కనిపిస్తారు.

‘ఫుడ్‌వేస్ట్‌’ ఇట్టే చెప్పేస్తుంది!

‘ఫుడ్‌ బిహేవియర్‌’ అనేది అందరికీ అవసరమే. పార్టీల్లో, ఫంక్షన్లలో ప్లేటు నిండా ఆహారాన్ని నింపుకుని, ఆ తర్వాత తినలేక డస్ట్‌బిన్‌లో పడేసేవారు చాలామంది కనిపిస్తారు. అలా వాళ్లు పారేస్తున్న పదార్థాల బరువు ఎంత ఉంటుందో అక్కడే తెలిసిపోతే ఎలా ఉంటుంది? మరోసారి ఫుడ్‌ వేస్ట్‌ చేసేందుకు ఎవరికీ మనసొప్పదు. అచ్చంగా అలాంటి ఆలోచనే ఇది. రాజస్థాన్‌లోని ‘అనిల్‌ అగర్వాల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌’లో ఈ డిజిటల్‌ డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేశారు. ఈ డస్ట్‌బిన్‌ ఆర్గానిక్‌, ప్లాస్టిక్‌, పేపర్‌, అదర్స్‌ పేరిట నాలుగు రకాల డబ్బాలతో ఉంటుంది.


వాటన్నింటిని ఒక డిజిటల్‌ త్రాసుతో అనుసంధానించారు. ప్లేట్‌లో మిగిలిన ఆహారపదార్థాలను డస్ట్‌బిన్‌లో వేయగానే అక్కడే ఉన్న డిజిటల్‌ త్రాసులో గ్రాములు, కిలోల లెక్కన ‘వేస్ట్‌’ బరువును చూపెడుతుంది. ‘దీనివల్ల ప్రతీ ఒక్కరికి ‘ఫుడ్‌ బిహేవియర్‌’ అలవడుతుందని, ఫుడ్‌ వేస్ట్‌ చాలా తగ్గింద’ని ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకులు అంటున్నారు. మన ఫంక్షన్‌హాళ్లలో కూడా ఇలాంటి డస్ట్‌బిన్‌లు ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో కదూ.

Updated Date - 2020-02-22T06:19:51+05:30 IST