సింగరేణిలో డిజిటల్‌ యోగా

ABN , First Publish Date - 2021-06-21T04:31:35+05:30 IST

సింగరేణిలో డిజిటల్‌ యోగా

సింగరేణిలో డిజిటల్‌ యోగా
యోగా శిక్షకురాలు బండి ఉష, పద్మ మయూరాసనంలో పతంజలి యోగా కేంద్రం నిర్వాహకుడు శర్మ, యోగాభ్యాసం చేస్తున్న డైరెక్టర్‌ (పా) బలరాం

కరోనా నేపథ్యంలో సామూహిక శిక్షణకు దూరం 

సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

కొత్తగూడెం, జూన్‌ 20: బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణిలో యోగా సందడి మొదలైంది. ప్రస్తుతం సామూహిక యోగా కాకుండా ఆన్‌లైన్‌ యోగా జోష్‌ పెరిగింది. ఏటా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి నిర్వహించే కార్య క్రమాలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటున్నాయి. అయితే గతేడాదిగా కరోనా నేపథ్యంలో సామూహిక యోగా శిబి రాల నిర్వహణ లేనప్పటికీ డిజిటల్‌ మాధ్యమాల ద్వారా సింగరేణిలో యోగపై విస్తృతంగా అవగాహన కల్పిస్తు న్నారు. ప్రస్తుతం ఏడో అంత ర్జాతీయ యోగా దినోత్సవానికి సింగరేణి సన్నద్ధమవుతోంది. గతానికి భిన్నంగా ప్రస్తుతం పూర్తిగా సోషల్‌ మీడియా, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా సింగరేణీయుల్లో యోగాపై అవగాహన కల్పిస్తోంది. 

ఏడేళ్ల క్రితమే అంకురార్పణ

సింగరేణిలో మొదటి నుంచి యోగాకు యాజమాన్యం పెద్దపీట వేస్తోంది. సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశాల మేరకు ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ‘మీ ఆరోగ్యం కోసం’ కార్యక్ర మాన్ని చేపట్టి యోగాను ఇందులో అంతర్భా గంగా చేశారు. ప్రతి ఏరియాలో యోగా కేంద్రాలను ప్రారం భించి సామూహిక యోగాభ్యాసం చేయించేందుకు వీలుగా యోగ శిక్షకులను నియమించారు. గనుల్లోనూ ఉద్యోగులు యోగాను ఆచరించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టా రు. కార్మికుల పని తీరుపైన యోగాభ్యాసం మంచి ప్రభా వాన్ని చూపింది. 

లిమ్కా బుక్‌లో చోటు.

2016 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున సింగ రేణి వ్యాప్తంగా 60వేల మందితో సామూహిక యోగా కార్య క్రమాన్ని నిర్వహించినట్లు జనరల్‌ మేనేజర్‌ (కో-ఆర్డినేషన్‌) కె. సూర్యనారాయణ తెలిపారు.

 ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ వేడుకకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం కూడా దక్కిందన్నారు. 2017లో 34,267మందితో 2018లో 1,29,305 మందితో 2019లో 1,27,437మందితో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అయితే కరోనా కారణంగా గతేడాది నుంచి ఇళ్లకే పరిమితమై యోగా భ్యాసం చేయాలని సూచించామన్నారు. 

కరోనాతో విభిన్న పంథా

గతేడాది కరోనా మహమ్మారి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల మార్గదర్శకాలకు లోబడి అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని ఇంట్లోనే జరుపుకోవాలని సింగరేణి యాజమాన్యం ఉద్యోగులకు సూచించింది. కరోనా నుంచి కోలుకోవడానికి, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధమన్న విష యంపై ఉద్యోగులకు అవగాహన కల్పించింది. అందరికీ అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఇంట్లోనే ఉంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ యోగ సాధన చేయాలని సూచించింది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ వెబ్‌ సైట్‌లో 45నిమిషాల నిడివిగల యోగా కామన్‌ ప్రొటోకల్‌ను గమనిస్తూ యోగా భ్యాసం చేయాలని ఆదేశాలు జారీచేసింది. 

యోగాను దిన చర్యగా చేసుకోవాలి : డైరెక్టర్‌ (పా) ఎన్‌.బలరాం 

సింగరేణి సంస్థ యోగాపై సింగరేణీయుల్లో అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రం, వీడియో ప్రోమోను సంస్థ వెబ్‌సైట్‌లో ప్రముఖంగా పొందుపర్చింది. సంస్థ యూ ట్యూబ్‌ ఛానల్‌ సింగరేణి సైరన్‌లోనూ ఉంచింది. ప్రతీఒక్కరూ యోగాను తన దినచర్యలో భాగం చేసుకో గలిగితే సత్ఫలితాలు ఉంటాయి.  

కొవిడ్‌ కట్డడికి యోగా

ఆసనాలతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదల

ఖమ్మం ఖానాపురం హవేలీ: కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శ్వాసనియమాలు పాటిస్తూ ఆసనాలు వేయడం వల్ల మాన సికంగా, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. ఒక క్రమపద్ధతిలో నిత్యం యోగా చేసే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుంది. ఖమ్మంజిల్లా కేంద్రంలోని వర్తక సంఘం కేంద్రంలో పతం జలి యోగా ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో యోగా తరగ తులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5గంటల నుంచి 7గంటల వరకు ఆ కేంద్రంలో సుమారు 50మంది ఆస నాలు సాధన చేస్తున్నారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో కూడా వారు శ్వాస ఆస నాలు చేయడంతో వైరస్‌ప్రభావం వారిపై కనిపించలేదు.

శ్వాస నియమాలతో ఆసనాలు..

శర్మ, పతంజలి యోగా కేంద్రం, ఖమ్మం

శ్వాస నియమాలలు పాటిస్తూ ఆసనాలు సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ప్రధానంగా పాణామాయా లలో కపాలబాతి, బస్త్రిక, సింహప్రియ, గ్రామరితో మంచి ఫలితాలు లభిస్తాయి. ఇమ్యూనిటీ పెరిగి కరోనాను జయిం చే శక్తి చేకూరుతుంది.

అంకెలే కాదు.. ఆసనాలు కూడా

యోగా శిక్షణలో మేటి ఉష

ఖమ్మంటౌన్‌: ఖమ్మంలో ఓ గణిత ఉపాధ్యాయురాలికి అంకెలతో ఆడుకోవడమే కాదు.. యోగాసనాలతో ఆరోగ్యం ప్రసాదించడమూ తెలుసు. నగరంలోని జలగంనగర్‌ జడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు బండి ఉష అలవోకగా యోగాసనాలు వేయ టమే కాకుండా, ఉచితంగా అందరికీ నేర్పుతున్నారు.  యోగాపై ఎంతో ఆసక్తి ఉన్న ఉష, ఎంతో కృషి చేసి పట్టు సాధి ంచారు. ఆమె భర్త లక్ష్మణరావు సైతం యోగా గురువే. ప్రభుత్వ ఉపాధ్యాయు డిగా ఉన్న ఆయన కూడా యోగాలో నిష్ణాతుడు. అరవింద యోగా సొసైటీ పేరుతో వేలాదిమందికి యోగాను ఉచి తంగా నేర్పారు. యోగా శిక్షకురాలు బండి ఉష యోగాలో ఎంతో పట్టు సాధించడంతో వివిధ శాఖల అధికారులు తమ ఉద్యోగులు విధి నిర్వహణ లో ఒత్తిడికి గురి కాకుండాఉషతో శిక్షణ ఇస్తున్నారు.

Updated Date - 2021-06-21T04:31:35+05:30 IST