విత్తన మొక్కజొన్నకు భలే గిరాకీ

ABN , First Publish Date - 2021-04-19T05:58:38+05:30 IST

యాసంగి పంటగా సాగు చేసిన విత్తన మొక్కజొన్న రైతులకు లాభాల పంట పండిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

విత్తన మొక్కజొన్నకు భలే గిరాకీ

మార్కెట్‌ ధరకంటే ఎక్కువకు ప్రైవేట్‌ సంస్థల కొనుగోలు

లాభాలు గడిస్తున్న రైతులు.. 

జిల్లాలో యాసంగి పంటగా పదివేల ఎకరాల్లో సాగు

కొణిజర్ల, ఏప్రిల్‌ 18: యాసంగి పంటగా సాగు చేసిన విత్తన మొక్కజొన్న రైతులకు లాభాల పంట పండిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సాధారణ మొక్కజొన్న క్వింటాల్‌ను కనీసం రూ.1300కు కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.ఈతరుణంలో విసుగు చెందినరైతులు కొందరు విత్తన మొక్కజొన్నను సాగుచేశారు. విత్తన మొక్కజొన్నలో అంతా ఆడమగ రకాన్ని రైతులు సాగు చేశారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన ప్రతినిధులు రైతులకు ఉచితం గా విత్తనాలను ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఒక ధరను నిర్ణయిం చారు. లాభసాటిగా ఉందని భావించిన రైతులు విత్తన మొక్క జొన్నను సాగు చేశారు.ఆ కంపెనీకి చెందిన సిబ్బంది ఏరియా వారీగా విత్తనాలను నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు సలహాలు ఇచ్చారు. వాతావరణం, నీటి సౌకర్యం బాగుం డటంతో దిగుబడి ఆశించిన మేరవచ్చింది. ఎగుమతి కూడా గంటల వ్యవధిలోనే జరుగుతుండటంతో రైతులకు ఉపయుక్తంగా ఉంటోంది.

రెండేళ్లుగా సీడ్‌పై రైతుల ఆసక్తి

జిల్లాలో రెండేళ్లుగా విత్తన మొక్కజొన్నను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది పదివేల ఎకరాలలో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను రైతులు సాగు చేశారు. నాలుగు నెలలకు పంట చేతికొచ్చింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఆధారంగా క్వింటాల్‌ మొక్కజొన్నను రూ.2వేల నుంచి 2,500 వరకు కంపెనీలు చెల్లిస్తున్నాయి. ఎకరాకు 35క్వింటాళ్ళ నుంచి50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఎకరానికి రూ.30వేలు వరకు రైతులకు పెట్టుబడి ఖర్చయింది.

వర్షానికైనా తట్టుకుంటుంది కాబట్టే.. 

సాధారణ మొక్కజొన్న.. వర్షం వస్తే కిందపడి దెబ్బతింటుంది. అదే ఆడమగ మొక్కజొన్న మాత్రం ఎంతవర్షం వచ్చినా కింద పడదని రైతులు చెబుతున్నారు. ఆయా కంపెనీలు పంటను కొను గోలు చేసిన 15రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో రైతుల ఖతాల్లో నగదు జమ చేస్తున్నారు. హైదరాబాద్‌, వీఎంబంజర, ఏలూరు ఆయా ప్రాంతాలకు చెందినకంపెనీలు విత్తన మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నాయి. కొణిజర్ల మండలం పల్లిపాడు దగ్గర వేబిడ్జి వద్ద ట్రాక్టర్ల ద్వారా పంటను తెచ్చి కాటాలు పెట్టించి లారీల ద్వారా వారివారి ప్రదేశాలకు తరలిస్తున్నారు. 


Updated Date - 2021-04-19T05:58:38+05:30 IST