నగరపాలకసంస్థలో విపత్తు నిర్వహణ కేంద్రం

ABN , First Publish Date - 2020-07-07T10:24:16+05:30 IST

ఖమ్మం నగరపాలక సంస్థలో విపత్తు నిర్వహణ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) కేంద్రాన్ని ఏర్పాటుచేసి త్వరలోనే సేవలను అందుబాటులోకి

నగరపాలకసంస్థలో విపత్తు నిర్వహణ కేంద్రం

శిక్షణ తీసుకోనున్న 21 మంది సభ్యులు

ప్రతీ డివిజన్‌కు ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌ మిషన్లు 

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం కార్పొరేషన్‌, జూలై 6: ఖమ్మం నగరపాలక సంస్థలో విపత్తు నిర్వహణ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) కేంద్రాన్ని ఏర్పాటుచేసి త్వరలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాఽధుల నివారణ చర్యల్లో బాగంగా నగరంలోని 50డివిజన్లకు ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌ మిషన్లు అందించనున్నట్లు  పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో 20 ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌ మిషన్లను పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే 30ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌ మిషన్లను అందుబాటులో ఉంచామని, మరో 20 కొత్త మిషన్లను రూ.40వేల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసి అప్పగించామన్నారు.


వర్షాకాలంలో, ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలను సరిచేసేందుకు త్వరలో విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, 21మంది సభ్యులను రాష్ట్ర విపత్తుకేంద్రానికి శిక్షణ కోసం పంపుతున్నామని వివిరించారు. రూ.50లక్షలతో రక్షణపరికరాలను కొనుగోలుచేసి, దీనికిగాను ప్రత్యేకయాప్‌ ప్రవేశపెడుతున్నామన్నారు. ఇతర నగరపాలక సంస్థలకు ధీటుగా ఖమ్మాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌జయంతి, మేయర్‌ డాక్టర్‌ జి.పాపాలాల్‌, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కర్నాటి కృష్ణ, షౌకత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-07T10:24:16+05:30 IST