Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెరుగు డబ్బాలతో డబ్బుల పంపకం

విజయవాడ: రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఖాళీ పెరుగు డబ్బాలలో డబ్బులు పెట్టి ఓటర్లకు పంచుతున్నాయని ఎస్ఈసీకి నగర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు ఫిర్యాదు చేశారు. నగరంలో ఓట్ల కొనుగోలు పార్టీలు డబ్బుల పంపకంపై ఎస్ఈసీకి ఏపీసీసీ లీగల్ సెల్  ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార, విపక్షాలు కలిసి దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు డబ్బు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఒక్కరోజే ఖాళీ పెరుగు డబ్బాల్లో డబ్బులు పెట్టి ఇంటింటికి పంచుతున్నారని ఆయన ఎస్ఈసీకి తెలిపారు. రెండు పార్టీలు ఒక్కొక్క ఓటును 1000 రూపాయలు చొప్పున కొనుగోలు చేశాయని ఎస్ఈసీకి కాంగ్రెస్ లీగల్ సెల్ తెలియచేసింది. అధికార వైసీపీ అక్రమాలను నగరంలో నిఘా వ్యవస్థలు పట్టించుకోవడం లేదని ఏపీసీసీ లీగల్ సెల్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. 

Advertisement
Advertisement