కంటోన్‌మెంట్‌ ప్రాంతాల్లో నిరంతరం పటిష్టమైన నిఘా కొనసాగించాలి: జిల్లా కలెక్టర్‌ ఎంవి రెడ్డి

ABN , First Publish Date - 2020-06-30T10:48:38+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు గుర్తించిన కట్టడి ప్రాంతాల్లో నిఘా కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి

కంటోన్‌మెంట్‌ ప్రాంతాల్లో నిరంతరం పటిష్టమైన నిఘా కొనసాగించాలి: జిల్లా కలెక్టర్‌ ఎంవి రెడ్డి

కొత్తగూడెం కలెక్టరేట్‌ జూన్‌ 29: కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు గుర్తించిన కట్టడి ప్రాంతాల్లో నిఘా కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌లు, వైద్యఆరోగ్యశాఖ, రెవెన్యూ, మున్సిపల్‌ కమిషనర్లతో కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన  నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.


వారితో సన్నిహితంగా ఉన్న వారందరిని హోం క్వారైంటన్‌ చేశామన్నారు,. పరిశ్రమల్లో పనిచేస్తున్న సిబ్బంది పట్టణాల్లో రాకపోకలు నిర్వహించడం వల్ల వ్యాధి సంక్రమిస్తుందన్నారు. సంబంధిత అధికారులు సిబ్బంది కార్యస్థానాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తులను ఉదయం సాయంత్రం పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్‌ చక్రవర్తి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌ నాయక్‌, డీసీహెచ్‌ఎ్‌స రమేష్‌, ఆర్డీవో స్వర్ణలత, కరోనా సర్వైలెన్సు అధికారి డాక్టర్‌ చేతన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T10:48:38+05:30 IST