క్వారంటైన్‌ను పరిశీలించిన జిల్లా నోడల్‌ అధికారి

ABN , First Publish Date - 2020-05-22T10:36:15+05:30 IST

వీఎంబంజర్‌కు చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో వీఎంబంజర్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని

క్వారంటైన్‌ను పరిశీలించిన జిల్లా నోడల్‌ అధికారి

పెనుబల్లి, మే 21: వీఎంబంజర్‌కు చెందిన ఒక మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో వీఎంబంజర్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని గురువారం కరోనా జిల్లా నోడల్‌ అధికారి డా క్టర్‌ కోటిరత్నం పరిశీలించారు. ఆమె క్వారంటైన్‌లో ఉ న్న వారి ఆరోగ్య స్థితిగతులను లంకాసాగర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి శాంతారాణి తహసీల్దార్‌ రవికుమార్‌, ఎస్‌ ఐ నాగరాజులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 260 మందిని ఉన్నత పాఠశాలతోపాటు లంకపల్లి, కుప్పెనకుంట్ల గురుకుల పాఠశాలల్లో క్వారంటైన్‌లో ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఆర్‌టీ టీం మేనేజర్‌ శ్రీకాంత్‌, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎస్‌ఐ నాగరాజు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T10:36:15+05:30 IST