‘కెరోటినాయిడ్ల’పై దివీస్‌ ల్యాబ్స్‌ దృష్టి

ABN , First Publish Date - 2021-03-27T06:28:43+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్‌లో కెరోటినాయిడ్లకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఈ విభాగంపై మరింతగా దృష్టి సారించాలని దివీస్‌ లేబరేటరీస్‌ భావిస్తోంది. గత ఏడాది కాలంలో కెరోటినాయిడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కంపెనీ

‘కెరోటినాయిడ్ల’పై దివీస్‌ ల్యాబ్స్‌ దృష్టి

ఏడాది కాలంలో రెట్టింపైన ఉత్పత్తి సామర్థ్యం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): అంతర్జాతీయ మార్కెట్‌లో కెరోటినాయిడ్లకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఈ విభాగంపై మరింతగా దృష్టి సారించాలని దివీస్‌ లేబరేటరీస్‌ భావిస్తోంది. గత ఏడాది కాలంలో కెరోటినాయిడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కంపెనీ రెట్టింపు చేసింది. ఆహార, బెవరేజీ, డైటరీ సప్లమెంట్స్‌లో రంగు కోసం కెరోటినాయిడ్లను వినియోగిస్తారు. జంతువుల్లో కెరోటినాయిడ్లు ఉత్పత్తి కావు. అందువల్ల జంతువుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి వీటి ని ఇస్తారు.  పౌలీ్ట్ర,  గుడ్లు,  చేపలు,  రొయ్యల నుంచి ఉత్పత్తి అయ్యే ఆహారానికి రంగు ఇచ్చేందుకు కూడా వీటిని వినియోగిస్తారు. మొత్తం కెరోటినాయిడ్ల విక్రయాల్లో దాదాపు 40 శాతాన్ని యానిమల్‌ ఫీడ్‌ పరిశ్రమ వినియోగిస్తోంది. 


వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందే నివారించడానికి అమెరికా వంటి దేశాల్లో ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మానవ డైటరీ సప్లమెంట్స్‌కు ఆదరణ పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏపీఐ/ఫినిష్డ్‌ ఫామ్‌ రూపంలో కెరోటినాయిడ్లను తయారు చేయడానికి దివీ్‌సకు పూర్తి స్థాయి సమగ్ర న్యూట్రాస్యూటికల్స్‌  సదుపాయం ఉంది. దివీస్‌ లేబొరేటరీస్‌ కెరోటినాయిడ్స్‌ విక్రయాలు 20-23 మధ్య ఏడాదికి 21 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా.  బీటా కెరోటిన్‌, లికోపిన్‌, లుటి న్‌ తదితర భిన్న రకాల కెరోటినాయిడ్లను కంపెనీ తయారు చేస్తోంది. 2017-18, 2019-20 మధ్య  దివీస్‌ కెరోటినాయిడ్ల  ఆదాయం రెట్టింపై రూ.440 కోట్లకు చేరింది. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 8 శాతం ఉంది. అంతర్జాతీయ కెరోటినాయిడ్ల మార్కెట్‌లో  బీఏఎ్‌సఎఫ్‌, డీఎ్‌సఎం,  దివీస్‌ ప్రధాన కంపెనీలు.  

Updated Date - 2021-03-27T06:28:43+05:30 IST