Hyderabad: బీజేపీ కార్పొరేటర్‌పై నాన్ బెయిలబుల్ కేసు
ABN , First Publish Date - 2022-09-15T13:17:10+05:30 IST
మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై(Division BJP Corporator Koppula Narsimha Reddy) నాన్ బెయిలబుల్
హైదరాబాద్/కొత్తపేట: మన్సూరాబాద్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై(Division BJP Corporator Koppula Narsimha Reddy) నాన్ బెయిలబుల్ కేసు(Non-bailable case) నమోదైంది. ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఎస్హెచ్ఓ అంజిరెడ్డి కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress)పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు ఇటీవల చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అక్కడి పోలీసు అధికారిపై బీజేపీ కార్యకర్త దాడి చేసిన ఘటన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలకు స్పందిస్తూ కార్పొరేటర్ నర్సింహారెడ్డి తెలంగాణలో కూడా పోలీసులపై దాడి చేసి, కొట్టాలనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. దీనిపై కిరణ్‌కుమార్ అనే వ్యక్తి రాచకొండ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ నర్సింహారెడ్డి విధ్వంసకర వాతావరణాన్ని ప్రేరేపించాడనే అభియోగాలపై రాచకొండ ఎల్బీనగర్ పోలీసులు 153ఏ, 505(2), 506, 189 ఐపీసీ సెక్షన్స్ కింద కార్పొరేటర్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై వివరణ ఇస్తూ నర్సింహారెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు.